అమెరికాలో దీపావళికి ప్రాముఖ్యత పెరుగుతోంది. గత రెండేళ్లుగా ఈ మార్పు మరింత వేగవంతమైంది. 2024లో పెన్సిల్వేనియా రాష్ట్రం దీపావళిని అధికారిక సెలవుదినంగా ప్రకటించిన మొదటి అమెరికన్ రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత 2025లో కనెక్టికట్ మరియు కాలిఫోర్నియా రాష్ట్రాలు కూడా దీనికి చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. మరోవైపు, న్యూయార్క్ నగరం 2023లోనే దీపావళి రోజున ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ ఏడాది, ఈ పండుగ మరో కీలక మైలురాయిని చేరుకుంది.
ఐదు రాష్ట్రాల్లో తొలిసారి...బిన్నత్వంలో ఏకత్వమే తమ బలం
అమెరికాలోని ఐదు రాష్ట్రాల గవర్నర్లు తమ అధికారిక నివాసాలు, రాష్ట్ర కాపిటల్ ప్రాంగణాలలో తొలిసారిగా అధికారికంగా దీపావళి వేడుకలను నిర్వహించడం విశేషం. అలాగే పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని 21 నగరాల మేయర్లు, తమ రాష్ట్ర రాజధానులలో, గవర్నర్ నివాసాలలో మరియు నగర పాలక కార్యాలయాలలో మొదటిసారిగా దీపావళి వేడుకలను నిర్వహించారు. వ్యాపార, ప్రజాసేవ, సాంస్కృతిక రంగాలలో భారతీయ అమెరికన్ల ప్రాముఖ్యతను, వారు అందిస్తున్న సేవలను అభినందించారు.
ఐడాహో, నెబ్రాస్కా, మోంటానా, నార్త్ డాకోటా, వాషింగ్టన్ రాష్ట్రాలలో ఈ వేడుకలు జరిగాయి. అక్టోబర్ మధ్యలో ప్రారంభమైన ఈ సంబరాలు నవంబర్ 10న సేలమ్‌లోని ఒరెగాన్ స్టేట్ కాపిటల్‌లో జరిగే ఆరో వేడుకతో ముగియనున్నాయి. అంతేకాదు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లో కూడా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు.
VIDEO | The Governors of Idaho, Nebraska, Montana, North Dakota and Washington hosted first-ever Diwali celebrations at their State Capitol Rotundas and Governors’ Mansions this year. Organised in partnership with the Consulate General of India in Seattle, the celebrations were attended by US Senators, Members of Congress, Mayors and members of the Indian-American community. Across Washington State, 22 cities held Diwali ceremonies in their City Council chambers, where Mayors and council members lit ceremonial lamps. Several states and cities also issued official proclamations recognising Diwali and the contributions of the Indian-American community. The celebrations began in mid-October and will conclude on November 10, 2026, with a state-level celebration hosted by the Governor of Oregon at the State Capitol in Salem, alongside ceremonies at Seattle City Hall and the King County Council. (Source: Consulate General of India, Seattle) (Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 6, 2026
ఇడాహో, నెబ్రాస్కా, మోంటానా, నార్త్ డకోటా , వాషింగ్టన్ రాష్ట్రాల గవర్నర్లు తమ అధికారిక నివాసాలు చరాష్ట్ర రాజధానులలో తొలిసారిగా దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అమెరికా చట్టసభ సభ్యులు , భారతీయ-అమెరికన్ సమాజ సభ్యులు హాజరయ్యారు. సియాటిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ భాగస్వామ్యంతో ఈ వేడుకలను నిర్వహించారు. సంబంధిత రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాలు, కాపిటల్ భవనాల్లో దీపావళి వేడుకలు జరగడం ఇదే తొలిసారని సీటెల్‌లోని భారత కాన్సులేట్ ప్రకటనలో తెలిపింది.
కమ్యూనిటీ నాయకులతో కలిసి భారత కాన్సులేట్ ఈ వేడుకలను నిర్వహించింది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, వాషింగ్టన్ రాష్ట్రంలోని పలు నగరాల్లో కూడా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో మేయర్లు దివ్యదీపాలను వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. నవంబర్ 4న ఒలింపియాలోని స్టేట్ కాపిటల్‌లో జరిగిన వేడుకలో వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ, భారతీయ అమెరికన్ సమాజం వేగంగా విస్తరిస్తోందని, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర కీలకమైనదని కొనియాడారు.
"అమెరికాలోనే అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లకు ఆశ్రయం కల్పిస్తున్న రాష్ట్రాలలో మాది ఒకటిగా ఉండటం గర్వకారణం. గత దశాబ్ద కాలంలో దేశంలోనే అత్యంత వేగంగా భారతీయ అమెరికన్ల జనాభా పెరిగిన రాష్ట్రం మాదే. మన రాష్ట్ర పురోగతికి ఈ సమాజం ఎంతో సహకారం అందించింది" అని ఫెర్గూసన్ తెలిపారు. ఒలింపియాలో జరిగిన కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి సందేశాన్ని వివరిస్తూ, సాంస్కృతిక వైవిధ్యమే తమ బలానికి మూలమని ఫెర్గూసన్ పేర్కొన్నారు.
గ్రేటర్ సీటెల్ ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారని కాన్సులేట్ వెల్లడించింది. అంతేకాకుండా, దీపావళి పండుగ ప్రాముఖ్యతను స్థానిక ఆర్థిక, సాంస్కృతిక రంగానికి భారతీయులు చేస్తున్న సేవలను గుర్తిస్తూ రాష్ట్ర, నగర ప్రభుత్వాలు అధికారిక ప్రకటనలను (ప్రోక్లమేషన్స్) కూడా విడుదల చేశాయి.
అక్టోబర్ 16న బోయిసీలోని స్టేట్ కాపిటల్ వద్ద ఐడాహో గవర్నర్ బ్రాడ్ లిటిల్ దీపావళి వేడుకలకు ఆతిథ్యమిచ్చారు. ప్రజలకు సేవ చేయడం, పౌర భాగస్వామ్యం మరియు ఆర్థిక వృద్ధికి భారతీయులు అందిస్తున్న సహకారంపై ఆయన మాట్లాడారు. "దాతృత్వాన్ని ఎంచుకోవడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఇతరులకు సేవ చేయడం, సవాళ్లు ఎదురైనప్పుడు కూడా ఆశను కోల్పోకుండా ఉండటంలోని ప్రాముఖ్యతను దీపావళి మనకు గుర్తు చేస్తుందన్నారు లిటిల్.
అక్టోబర్ 20న లింకన్‌లో నెబ్రాస్కా గవర్నర్ జిమ్ పిల్లెన్ దీపావళి వేడుకలను నిర్వహించి, తమ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలని కుటుంబాలకు పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పాల్గొన్న అమెరికా ప్రజాప్రతినిధి డోన్ బాకన్ కూడా భారతీయ అమెరికన్ సమాజంపై ప్రశంసల వర్షం కురిపించారు.
అక్టోబర్ 26న హెలెనాలోని గవర్నర్ భవనంలో మోంటానా గవర్నర్ గ్రెగ్ జియాన్ఫోర్టే అతిథులకు స్వాగతం పలికారు. వేర్వేరు సంస్కృతులు, నేపథ్యాలు ఉన్న ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, బంధాలను బలోపేతం చేసుకోవడంపై ఆయన మాట్లాడారు.
ఆ తర్వాత మూడు రోజులకు (అక్టోబర్ 29న) బిస్మార్క్‌లోని గవర్నర్ నివాసంలో నార్త్ డాకోటా గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్ దీపావళి వేడుకలను నిర్వహించారు. ఆర్మ్‌స్ట్రాంగ్, ఆయన భార్య కెర్ స్టీ ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు కాన్సుల్ జనరల్ కలిసి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
"మనం ఈ సంబంధాలను, స్నేహాలను వేడుకలా జరుపుకోవాలి. మన మధ్య ఉన్న వైవిధ్యమే మన బలం" అని ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యాఖ్యానించారు. వర్తకం, దౌత్యం, రాష్ట్ర స్థాయి భాగస్వామ్యాల ద్వారా భారత్‌తో ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో మొదటిసారిగా సిటీ హాల్‌లో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మేయర్ స్వయంగా దీపాలను వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ అమెరికన్ సమాజానికి ఇది ఒక అద్భుతమైన మైలురాయి అంటూ అక్కడ స్థానికుల్లో అనందం వెల్లివిరిసింది.
This is special. San Francisco just celebrated Diwali inside City Hall for the very first time, with the Mayor joining the diya lighting ceremony. A beautiful milestone for the Indian American community. ❤️🪔 https://t.co/2hjrEPZhdC
— LIFE IS 🎶BEAUTIFUL (@DEVIKA12327912) November 6, 2026

వాషింగ్టన్ రాష్ట్రంలో ఆబర్న్, బెల్లెవ్యూ, కిర్క్‌లాండ్, ఎవెరెట్, బోథెల్, టాకోమా, స్పోకేన్, కెంట్ తదితర నగరాల్లో కూడా ఈ వేడుకలు జరిగాయని కాన్సులేట్ తెలిపింది. స్నోక్వాల్మీ, కింగ్ కౌంటీ, సీటెల్‌లలో మరిన్ని వేడుకలతోపాటు,ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.


