టీచర్లకు బీఎల్‌వో విధులు చట్టబద్ధమే | Government Teachers can be assigned poll-related work | Sakshi
Sakshi News home page

టీచర్లకు బీఎల్‌వో విధులు చట్టబద్ధమే

Nov 8 2026 5:17 AM | Updated on Nov 8 2026 5:17 AM

Government Teachers can be assigned poll-related work

అలహాబాద్‌ హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపాధ్యాయులను బూత్‌ లెవల్‌ అధికారు(బీఎల్‌వో)లుగా నియమించడం చట్టబద్ధమేనని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఉపాధ్యాయులకు ఓటరు జాబితా సవరణ తదితర ఎన్నికల బాధ్యతల అప్పగింత విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ)–2009 సెక్షన్‌ 27లోని మినహాయింపుల కిందకే వస్తాయని తేల్చిచెప్పింది. 

తమను బీఎల్‌వోలుగా నియమిస్తూ యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కొందరు టీచర్లు అలహాబాద్‌ హైకోర్టు ను ఆశ్రయించారు. ఓటర్ల జాబితా సవరణ, బీఎల్‌వో వంటి బాధ్యతల కారణంగా పాఠ శాలల్లో విద్యా బోధన కుంటుపడుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర విధులకు వినియోగించకూడదనే నిబంధన విద్యాహక్కు చట్టం చెబుతోదన్నారు. 

వాదనలు విన్న అలహాబాద్‌ కోర్టు.. విద్యాహక్కు చట్టంలో ఉపాధ్యాయు లను బోధనేతర విధులకు దూరంగా ఉంచాలనే నిబంధన ఉన్నప్పటికీ, స్పష్టమైన మినహాయింపులు సైతం ఉన్నాయంది. పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణ, విపత్తు నిర్వహణ విధులతో పాటు స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను వినియోగించుకోవచ్చని సెక్షన్‌ 27 నిర్దేశిస్తోందని వివరించింది. బీఎల్‌వో విధులు, ఓటర్ల జాబితా తయారీ, సవరణ వంటి ప్రక్రియలు నేరుగా ఎన్నికల విధుల్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement