తెలంగాణలో కొత్త ఓటర్లకు బిగ్‌ అలర్ట్‌.. నేడే, రేపే ఛాన్స్‌! | Telangana Voter Registration: Last Chance to Enroll Today and Tomorrow | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త ఓటర్లకు బిగ్‌ అలర్ట్‌.. నేడే, రేపే ఛాన్స్‌!

Oct 15 2026 7:13 AM | Updated on Oct 15 2026 7:18 AM

Telangana Voter Registration: Last Chance to Enroll Today and Tomorrow

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఇవాళ, రేపు (అక్టోబర్‌ 15, 16 తేదీల్లో) రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవల్‌ అధికారులు (BLO) అందుబాటులో ఉండనున్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవాలనుకునేవారు ఫామ్‌-6 నింపి బీఎల్వోలకు అందజేయాలి. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సర్‌ నేపథ్యంలో..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ, ఓట్ల తొలగింపుపై వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ఆందోళనలు, గందరగోళం నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోవడం కీలకంగా మారింది. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు నమోదు కానివారు ఫామ్‌-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పేరు తొలగించబడిందని అనుమానం ఉన్నవారు బీఎల్వోను సంప్రదించి వివరాలను నిర్ధారించుకోవాలి.

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైనది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవడంతోపాటు, అవసరమైన సవరణల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కరెంట్‌ పోతే ఐఏఎస్‌లపై వేటా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement