సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా మోదీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు .
Have a great Diwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026
దీపావళి వెలుగుల పండుగ అని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశమంతా దీపాల కాంతులతో వెలిగిపోతున్న ఈ పర్వదినం ప్రతి ఒక్కరి భవిష్యత్తులో ఆనందం, శాంతి, శ్రేయస్సును నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఏడాది భారత సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు సంప్రదాయంగా మారిందని, ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తానని మోదీ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రజల వాహనాల్లో పెట్రోల్ చోరీ: రాహుల్ గాంధీ


