దుండగుల కాల్పులు.. 7 గురు మృతి | Seven killed in shooting at Jordan church | Sakshi
Sakshi News home page

దుండగుల కాల్పులు.. 7 గురు మృతి

Oct 23 2026 6:41 PM | Updated on Oct 23 2026 6:57 PM

 Seven killed in shooting at Jordan church

అమ్మాన్‌: జోర్డాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తుపాకులతో ఇద్దరు దుండగులు చర్చిలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ వివరాల్ని  జోర్డాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అల్-మమ్లకా  టెలివిజన్‌ ప్రసారం చేసింది.

ఏం జరిగింది? 

అంత్యక్రియలకు హాజరైన ఖలీద్ బుర్కాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ చర్చిలో అంత్యక్రియల ఊరేగింపు జరుగుతుండగా, ఓ వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు కిందికి దిగి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో ఒక దుండగుడి చేతిలో రైఫిల్, మరో వ్యక్తి చేతిలో పిస్టల్ ఉన్నాయని, వారు కొన్ని నిమిషాల పాటు కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు.

ఘటన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే చర్చివద్దకు చేరుకున్నాయి. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. కాల్పులకు పాల్పడిన వారి వివరాలు, దాడి వెనుక ఉద్దేశం ఇంకా వెల్లడికాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. జోర్డాన్ అధికారులు కూడా నిందితులు ఎవరనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

జోర్డాన్‌లో క్రైస్తవులు మైనారిటీ వర్గంగా ఉన్నప్పటికీ, ఆ దేశంలో అనేక బైబిల్‌ సంబంధిత చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ యాత్రికులు వస్తుంటారు. అలాంటి దేశంలో చర్చిలో అంత్యక్రియల సందర్భంగా కాల్పులు జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, నిందితుల ఆచూకీపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.


ఇదీ చదవండి: మోజ్తాబా ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement