ఒరెగాన్ స్టేట్ పోర్ట్‌లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. R.A Brown Middle Schoolలో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకి పోర్ట్‌లాండ్ మెట్రో సిటీస్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు, చిన్నారులు తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి, ఆట పాటలతో సందడి చేశారు.
ఆ తర్వాత బతుకమ్మ నిమజ్జనం అనతంరం ప్రసాద వితరణ చేశారు. అలాగే విజయదశమి పర్వదినం పురస్కరించుకుని జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ బలాయ్ చేసుకున్నారు. కాగా, బతుకమ్మ రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేసింది.
ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల ఓటీఏ టీం తరుపున బతుకమ్మ దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పండుగని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు, సహకారం అందించిన స్పాన్సర్‌కి శ్రీని ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా వేడుకల్లో పాల్గొన్న పోర్ట్‌లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకరించిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఓటీఏ టీమ్ తరుఫున అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: హాంకాంగ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు


