ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం | Ranji Trophy 2026-27: Hyderabad Edge Chhattisgarh by 1 Wicket in a Thriller at Gymkhana | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

Nov 5 2026 4:11 PM | Updated on Nov 5 2026 4:26 PM

Ranji Trophy 2026-27: Hyderabad Edge Chhattisgarh by 1 Wicket in a Thriller at Gymkhana

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో హైదరాబాద్ తమ జోరును కొనసాగిస్తోంది. ఎలైట్ గ్రూప్‌-బిలో భాగంగా జింఖానా క్రికెట్ మైదానం వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఛత్తీస్‌గడ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి చేధించింది.

 ఈ విజయంలో అనికేత్ రెడ్డి(39), అభిర‌థ్ రెడ్డి(68),వ‌రుణ్ గౌడ్‌(55), ర‌క్ష‌ణ్ రెడ్డి(15) కీల‌క పాత్ర పోషించారు. చివ‌రి వికెట్ ప‌డ‌గొట్టి విజ‌యం సాధించాల‌న్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఆశ‌ల‌పై హైద‌ర‌బాద్ టెయిలాండ‌ర్లు అనికేత్‌, ర‌క్ష‌ణ్ త‌మ వీరోచిత పోరాటంతో నీళ్లు జ‌ల్లారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బౌల‌ర్ల‌లో ఆధిత్య సింగ్ మూడు,ధర్మేంద్రసింహ్ జడేజా, జ‌యంత్ యాద‌వ్‌, అజ‌య్ జాద‌వ్ మండ‌ల్ త‌లా రెండు వికెట్లు చొప్పున ప‌డ‌గొట్టారు.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛ‌త్తీస్‌గ‌ఢ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 284 ప‌రుగులు చేసింది. అంజూ తివారీ(72), వికల్ప్ తివారీ(69) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. అనంత‌రం హైద‌రాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 280 ప‌రుగులు చేసింది. రాహుల్ రాదేశ్(72), హిమ‌తేజ‌(46)  టాప్ స్కోర‌ర్ల‌గా నిలిచారు. 

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు మొద‌టి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 4 ప‌రుగుల ఆధిక్యం మాత్ర‌మే ల‌భించింది. ఛ‌త్తీస్‌గ‌డ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి హైద‌రాబాద్ ముందు ఛ‌త్తీస్‌గ‌ఢ్ 256 ప‌రుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ టార్గెట్‌ను హైద‌రాబాద్ చేధించి మూడో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement