సికింద్రాబాద్: బండిమెట్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి బాలాజీ మెడికల్ షాప్‌లో మంటలు అంటుకుని చెలరేగాయి. పొగ దట్టంగా అలుముకుంది. స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


