అజయ్ నాగ్, శ్రీకాంత్, సత్యదేవ్, శివచరణ్ రెడ్డి,
‘‘నేను ఇప్పటిదాకా ఎవర్నీ చాన్స్ ఇవ్వమని అడగలేదు. అందుకు నా మొహమాటమే కారణం. అయితే మోహమాటాన్ని వదలిపెట్టి నాతో సినిమా చేయమని నేను అడిగిన తొలి వ్యక్తి దర్శకుడు అజయ్’’ అని సత్యదేవ్ అన్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సమవర్తి’. గానవి లక్ష్మణ్ హీరోయిన్‌గా నటించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘నేను డ్రీమ్‌గా భావించిన షాట్స్, సీన్స్‌ను నాతో అజయ్ చేయించాడు. దక్షిణ భారతదేశంలో ఎన్ని అడవులున్నాయో అన్నింట్లో మేం షూటింగ్ చేశాం. మాకు ఇదొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్‌లో మీకూ అదే ఫీల్ కలిగిస్తుంది’’ అన్నారు.
‘‘ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు శ్రీకాంత్. ‘‘నా ఆరంభం’ సినిమా తర్వాత సత్యదేవ్ అన్న పిలిచి మరీ ‘సమవర్తి’కి చాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. షూటింగ్‌లో గాయపడ్డారు కూడా. శ్రీకాంత్‌గారు చేసిన క్యారెక్టర్‌తోనే సినిమా ్రపారంభం అవుతుంది’’ అని చెప్పారు అజయ్ నాగ్ .వి.‘‘తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చే చిత్రం ఇది’’ అన్నారు శశిధర్. ‘‘ఈ టీమ్‌లోని ప్రతి ఒక్కరి కెరీర్‌లో గుర్తుండిపోయే విజయం లభిస్తుంది’’ అని తెలిపారు శివచరణ్ రెడ్డి.


