ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి సరికొత్త అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాభారతంలోని వీరుడు కర్ణుడి పాత్రలో ఆయన నటిస్తున్న ‘మహావీర కర్ణ’ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. పెన్ మూవీస్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇదీ చదవండి: వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి..!
‘ఏ ఫేస్.. ఏ లెజెండ్.. ఏ వారియర్’ ..
‘ఏ ఫేస్.. ఏ లెజెండ్.. ఏ వారియర్’ అంటూ రాఘవ లారెన్స్‌ను మహావీర కర్ణగా పరిచయం చేసింది. పోస్టర్‌లో లారెన్స్ బంగారు కవచంతో, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. వెనుక మంటలతో కూడిన నేపథ్యం ఆయన పాత్రలోని వీరత్వాన్ని మరింతగా ఎలివేట్ చేస్తోంది. ఈ లుక్‌లో రాఘవ లారెన్స్‌ను చూస్తే గతంలో కనిపించిన ఆయన పాత్రలకు పూర్తి భిన్నంగా అనిపిస్తోంది.
సినిమా విషయానికి వస్తే..
‘మహావీర కర్ణ’ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. లైవ్ యాక్షన్‌తో పాటు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి మహాభారత ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.మహాభారతంలో కర్ణుడి పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరత్వం, దానగుణం, స్నేహం, విధేయతతో పాటు విషాదభరితమైన జీవిత ప్రయాణం కర్ణుడి పాత్రను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. అలాంటి కీలక పాత్రను రాఘవ లారెన్స్ పోషిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్‌తోనే భారీ అంచనాలు పెంచిన ‘మహావీర కర్ణ’లో రాఘవ లారెన్స్ కర్ణుడిగా ఎలా కనిపించనున్నారో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: హీరో ధనుష్ తండ్రి సినిమా ‘హబీబీ’.. ఓటీటీలోకి..!


