రెండో రోజుకి తగ్గిపోయిన 'ప్యారడైజ్' కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు? | Nani The Paradise Movie Day 2 Worldwide Box Office Collections Amid Mixed Talk, Check Latest Numbers Inside | Sakshi
Sakshi News home page

Paradise Collection: నాని 'ప్యారడైజ్'కి రెండు రోజుల్లో ఎంతొచ్చాయ్?

Sep 26 2026 10:00 AM | Updated on Sep 26 2026 10:50 AM

Paradise Collection Day 2 Worldwide

నాని 'ప్యారడైజ్' సినిమా గురించే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది. బాగుంది? బాగోలేదా? అనే కంటే మూవీలో సన్నివేశాలు, లాజిక్స్ గురించి జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు భారీగా వచ్చిన కలెక్షన్స్.. రెండో రోజుకి వచ్చేసరికి చాలానే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇప్పటివరకు వచ్చిన వసూళ్లెంత?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా ముకేశ్.. వచ్చినరోజే జాక్ పాట్ కొట్టిన అపూర్వ)

నాని 'ప్యారడైజ్' సినిమాకు ఏడాది ముందు నుంచే బీభత్సమైన హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లే పాటలు హిట్టయ్యేసరికి బ్లాక్‌బస్టర్ కొట్టేస్తుందేమోనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే తొలిరోజు రూ.88 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించుకున్నారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ టాక్ రకరకాలుగా వినిపించింది. దీంతో రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు రూ.110 కోట్ల గ్రాస్ వచ్చిందనమాట.

ఓవరాల్‌గా 'ప్యారడైజ్' సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటినప్పటికీ టాక్ మిక్స్‌డ్ ఉంది. దీంతో తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఎన్ని కోట్లు వస్తాయనేది ఇప్పుడు డిస్కషన్‌గా మారింది. ఇక మూవీ ఫలితం గురించి స్పందించిన నాని.. ట్రోల్స్ ఎంజాయ్ చేశాను. తప్పులు తెలుసుకున్నానని ట్వీట్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ కూతురి లవ్‌స్టోరీ.. ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement