దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు: సంపూర్ణేష్ బాబు | Sampoornesh Babu Reacts On journalist questions about him | Sakshi
Sakshi News home page

దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు: సంపూర్ణేష్ బాబు రియాక్షన్

Sep 25 2026 3:30 PM | Updated on Sep 25 2026 4:00 PM

Sampoornesh Babu Reacts On journalist questions about him

నాని ది ప్యారడైజ్‌లో బిర్యానీ పాత్రలో మెప్పించిన నటుడు సంపూర్ణేశ్ బాబు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనను అమానించేలా జర్నలిస్ట్ ప్రశ్నలు ‍అడిగారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. జర్నలిస్ట్ తీరుపై పలువురు అ‍భ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై నటుడు సంపూర్ణేశ్ బాబు కూడా స్పందించారు.

నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టుకి.. నాకు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే అలా మాట్లాడారని సంపూర్ణేశ్ తెలిపారు. మా మధ్య స్నేహం వల్లే అలా అతను ఫ్లో లో అడిగారని వెల్లడించారు . ఈ విషయాన్ని దయచేసి ఎవరూ కూడా తప్పుగా తీసుకోవద్దని అన్నారు. ఈ మేరకు సంపూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడినట్లే.

అసలేం జరిగిందంటే?

ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబును సీనియర్ జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్‌లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement