యాక్షన్ మోడ్‌ | Allu Arjun Raka New Shooting Schedule to Begin in October | Sakshi
Sakshi News home page

యాక్షన్ మోడ్‌

Sep 29 2026 12:26 AM | Updated on Sep 29 2026 12:26 AM

Allu Arjun Raka New Shooting Schedule to Begin in October

‘రాకా’ సినిమా కోసం అల్లు అర్జున్   మరోసారి పూర్తిగా యాక్షన్   మోడ్‌ను ఆన్   చేయబోతున్నారని తెలిసింది. అల్లు అర్జున్   హీరోగా అట్లీ దర్శకత్వంలో రూ పొందుతున్న అడ్వెంచరస్‌ ఫాంటసీ యాక్షన్   డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకొనె లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, రష్మికా మందన్నా, జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్   త్రిపాత్రాభినయం(తండ్రి, ఇద్దరు కొడుకులు) చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

వాటిలో ఒకటి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర కాగా, మరొకటి నెగటివ్‌ రోల్‌ అనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ చిత్రానికి పునర్జన్మల కాన్సెప్ట్‌ కూడా ఉందట. ఈ మూవీ కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ అక్టోబరు రెండో వారంలో ప్రారంభం కానుందని, సినిమాకు ఎంతో కీలకమైన ఓ భారీ యాక్షన్   సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు అట్లీ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ యాక్షన్   సీక్వెన్స్ లో అల్లు అర్జున్  తో పాటుగా ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. సన్  పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్   నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా 2027లో రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement