‘‘భారతదేశంలో 150 ఏళ్ల క్రితం ఘోర ఘటన జరిగింది. ఈ కరువు కాలంలో మన భారతీయులు ఆకలితో చనిపోతుంటే బ్రిటీషర్స్ మాత్రం లక్షలాది టన్నుల ధాన్యం బ్రిటన్‌కు, వారు యుద్ధాలు చేస్తున్న ప్రాంతాలకు తరలించేవారు. ఆకలితో అలమటిస్తూనే బ్రిటీషర్స్ కోసం ప్రజలు ధాన్యం మోసేవారు. ఇది ఒకప్పుడు నిజంగా జరిగిందనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటూ ‘రణబాలి’ లాంటి ఒక మంచి స్టోరీని తెరకెక్కించాం. ఆ కరువు కాలంలో అమరులైన ప్రజలకు నివాళిగా ఈ మూవీని రూ పొందించాం’’ అని హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 16న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా ‘రణబాలి: నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్’ పేరుతో రూ పొందించిన 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్‌లో ఫస్ట్ ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ సోమవారం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ–‘‘1976–78 మధ్య కాలంలో ‘ది గ్రేట్ మద్రాస్’ కరువు ఏర్పడింది అని ఉంది. ఈ రెండేళ్లలో కరువు కారణంగా కోటి మంది భారతీయులు చనిపోయారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ కరువు ఘటన గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. వారు చేసిన త్యాగాలను, పడిన బాధను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను’’ అన్నారు రష్మికా మందన్నా.


