22ఏళ్లకే బిగ్‌బాస్‌లోకి.. రెండు రోజుల్లోనే 15లక్షలు.. ఎవరీ కుర్రాడు? | Who Is Mithilesh Reddy Bigg Boss 10 Contestant Walks Out With 15 Lakh Cash Prize | Sakshi
Sakshi News home page

22ఏళ్లకే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ.. రెండు రోజుల్లోనే రూ.15లక్షలు.. ఎవరీ కుర్రాడు?

Sep 28 2026 9:26 PM | Updated on Sep 28 2026 9:28 PM

Who Is Mithilesh Reddy Bigg Boss 10 Contestant Walks Out With 15 Lakh Cash Prize

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10 అభిమానుల అంచనాలకు భిన్నంగా సాగుతోంది. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఇద్దరు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో కామనర్స్ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. అనూహ్య నిర్ణయంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. శనివారం ఎపిసోడ్‌లో రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అసలు మిథిలేష్ రెడ్డి ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

మదనపల్లికి చెందిన ఫిట్‌నెస్ మోడల్
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మిథిలేష్ రెడ్డి ఫిట్‌నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నతనం నుంచే ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తన శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నాడు. తన వర్కవుట్ వీడియోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సంపాదించుకున్నాడు.

తొలిరోజే సిక్స్ ప్యాక్‌తో..
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజే మిథిలేష్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. షర్ట్ విప్పి తన కండలు చూపించడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల దృష్టిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. ఇక మిథిలేష్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారట.

అగ్నిపరీక్షలోనూ సందడి
బిగ్‌బాస్‌లోకి రాకముందే మిథిలేష్ రెడ్డి ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో కనిపించాడు. అక్కడ కూడా తన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకున్నాడు. షర్ట్ విప్పి కండలు చూపించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో కామనర్‌గా అవకాశం దక్కించుకున్నాడు.

రూ.15 లక్షలు తీసుకుని బయటకు..
హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండి టైటిల్ కోసం పోటీ పడటం కంటే.. రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి బయటకు రావడానికే మిథిలేష్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దీంతో బిగ్‌బాస్‌ చరిత్రలోనే భిన్నమైన నిర్ణయం తీసుకున్న కంటెస్టెంట్‌గా నిలిచాడు. 22 ఏళ్ల వయసులోనే బిగ్‌బాస్ వేదికపై కనిపించి.. తనకు వచ్చిన అవకాశాన్ని నగదు బహుమతిగా మార్చుకుని బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: సెహ్వాగ్‌కు కొత్త పంచాయితీ..! దుస్తులు చింపి.. ఆపై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement