breaking news
Mithilesh Reddy
-
22ఏళ్లకే బిగ్‌బాస్‌లోకి.. రెండు రోజుల్లోనే 15లక్షలు.. ఎవరీ కుర్రాడు?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 అభిమానుల అంచనాలకు భిన్నంగా సాగుతోంది. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఇద్దరు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో కామనర్స్ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. అనూహ్య నిర్ణయంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. శనివారం ఎపిసోడ్లో రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అసలు మిథిలేష్ రెడ్డి ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.మదనపల్లికి చెందిన ఫిట్నెస్ మోడల్ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మిథిలేష్ రెడ్డి ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నతనం నుంచే ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తన శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నాడు. తన వర్కవుట్ వీడియోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సంపాదించుకున్నాడు.తొలిరోజే సిక్స్ ప్యాక్‌తో..బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజే మిథిలేష్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. షర్ట్ విప్పి తన కండలు చూపించడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల దృష్టిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. ఇక మిథిలేష్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారట.అగ్నిపరీక్షలోనూ సందడిబిగ్బాస్లోకి రాకముందే మిథిలేష్ రెడ్డి ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో కనిపించాడు. అక్కడ కూడా తన ఫిట్నెస్తో ఆకట్టుకున్నాడు. షర్ట్ విప్పి కండలు చూపించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కామనర్‌గా అవకాశం దక్కించుకున్నాడు.రూ.15 లక్షలు తీసుకుని బయటకు..హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండి టైటిల్ కోసం పోటీ పడటం కంటే.. రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి బయటకు రావడానికే మిథిలేష్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే భిన్నమైన నిర్ణయం తీసుకున్న కంటెస్టెంట్‌గా నిలిచాడు. 22 ఏళ్ల వయసులోనే బిగ్‌బాస్ వేదికపై కనిపించి.. తనకు వచ్చిన అవకాశాన్ని నగదు బహుమతిగా మార్చుకుని బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సెహ్వాగ్‌కు కొత్త పంచాయితీ..! దుస్తులు చింపి.. ఆపై.. -
బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!
తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటివరకు 9 సీజన్లు నడిచింది. దీని వల్ల బాగుపడినవాళ్లు మహా అయితే ఒకరో ఇద్దరు ఉంటారంతే! అంతకుమించి లేరు. ప్రైజ్‌మనీ, డబ్బుల గురించి ఎప్పుడో సీజన్ చివరాఖరుకు వచ్చేసరికి మాట్లాడుకుంటారు తప్పితే మిగతా టైంలో అసలు దీని గురించి డిస్కషనే ఉండదు. కానీ మిథిలేష్ అనే కుర్రాడి కారణంగా మొత్తం సీనే మారిపోయింది. షో పరువంతా పోయింది! ఇంతకీ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇప్పటివరకు చాలామంది బిగ్‌బాస్‌కి వచ్చారు. కొందరు తమకున్న ఇమేజ్ చెడగొట్టుకోగా.. మరికొందరు మంచి గుర్తింపు తెచ్చుకుని బయటకొచ్చారు. కానీ ఎవరిని అడిగినా కప్పు కొట్టడమే ముఖ్యం. డబ్బులది ఏముంది ఎలా అయినా సంపాదించుకోవచ్చు, పేరు ముఖ్యం లాంటి కబుర్లు చెబుతారు. కానీ వీళ్లలో చాలామందికి తెలుసు నిజంగా వాళ్లు కప్పు కొట్టగలరో లేదో?అంతెందుకు సీజన్ చివరిరోజున కప్ కావాలా? డబ్బులు కావాలా? అని హోస్ట్ నాగార్జున అడిగితే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు కూడా తెలుసు. తమకు కచ్చితంగా కప్ రాదని, అందుకు ఎంచక్కా సూట్ కేసు తీసుకుని లక్షాధికారులు అయిపోతుంటారు. కానీ ఈ సీజన్లో మిథిలేష్ అనే కామనర్.. కప్ కంటే తనకు డబ్బులే ముఖ్యం అని హౌస్‌లోకి వచ్చిన రెండో రోజే హోస్ట్ నాగార్జునకే ఓపెన్‌గా చెప్పి బయటకొచ్చేశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. ఈ ట్విస్ట్ నాగార్జున కూడా ఊహించి ఉండడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు)ఈ షోకి వచ్చేవాళ్లలో దాదాపు అందరూ చివరిరోజున వచ్చే డబ్బుల కోసమే వస్తారు అనేది పచ్చినిజం. కానీ ఎవరూ పైకి చెప్పరు. ఇదో బహిరంగా రహస్యం. అయితే డబ్బుల సూట్ కేసు తీసుకుని స్వయంగా బయటకొచ్చిన విషయంలో గతంలో సొహైల్, ఇప్పుడు ఈ మిథిలేష్ జనానికి బాగా గుర్తుండిపోతారు. హౌస్‌లో మరో మూడు నాలుగు వారాలున్నా సరే మిథిలేష్‌కి ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదేమో! కేవలం రెండే రోజులు ఉండి.. ఎంచక్కా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. అంతెందుకు ఈ సీజన్లోనే వంద రోజులు ఉండి నెగ్గినా గానీ ఇంతకంటే ఎక్కువ డబ్బయితే రాదుగా! దీంతో సోషల్ మీడియా అంతా కూడా మిథిలేష్ సరైన పనే చేశాడని మెచ్చుకుంటున్నారు.అయితే మిథిలేష్ చాలా పెద్ద తప్పు చేశాడన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి షో ఆర్గనైజర్స్ అష్టకష్టాలు పడుతున్నారు. ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత శివాజీతో చేసిన బజ్ ఇంటర్వ్యూలోనూ ఎందుకొచ్చావ్ బిగ్‌బాస్‌కి? అని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగారు. కానీ మిథిలేష్ మాత్రం కూల్‌గా వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా సమాధానమిచ్చాడు.ఇప్పటివరకు పది సీజన్లు జరిగితే అందులో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి ఎంతమంది టాప్-5కి వెళ్లారు? మీరే చెప్పండి అని ఉల్టా శివాజీకే మిథిలేష్ ఎదురుప్రశ్న వేశాడు. టాప్-5లో ప్రతి సీజన్లోనూ ఓ ఫిమేల్(సీరియల్ హీరోయిన్ లేదా సెలబ్రిటీ), ఓ ఎంటర్ టైనర్, మొదటి నుంచి మ్యానిపులేట్ చేసే వ్యక్తి ఉంటారని మిథిలేష్ చెప్పడం.. షో తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. దీనిబట్టి చూస్తే మిథిలేష్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించని బిగ్‌బాస్ టీమ్.. డబ్బుతో పాటు పరువు కూడా పోగొట్టుకున్నట్లే!(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్)


