సతీమణి బర్త్‌ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్ | Allu Arjun Special Birthday Wishes To His Wife allu Sneha Reddy | Sakshi
Sakshi News home page

Allu Arjun: సతీమణి బర్త్‌ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్

Sep 29 2026 1:50 PM | Updated on Sep 29 2026 2:47 PM

Allu Arjun Special Birthday Wishes To His Wife allu Sneha Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే క్యూటీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం స్నేహరెడ్డికి బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. కాగా.. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రాకాతో బిజీగా బన్నీ..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాకా మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబయి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే రాకా టీమ్ మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.  ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్  త్రిపాత్రాభినయం(తండ్రి, ఇద్దరు కొడుకులు) చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. సన్  పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్  నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో రిలీజ్‌ కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement