ప్రముఖ ఆలయంలో ది ప్యారడైజ్ హీరో నాని పూజలు | Hero Nani Visited The Sri Gattamma Devasthanam In Mulugu With Paradise Team After Box Office Success, Video Goes Viral | Sakshi
Sakshi News home page

The Paradise Movie: మేడారంలో హీరో నాని ప్రత్యేక పూజలు

Sep 29 2026 1:20 PM | Updated on Sep 29 2026 2:09 PM

Hero Nani visited the Sri Gattamma Devasthanam in Mulugu

నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే మిక్స్‌డ్‌ టాక్ అందుకున్న ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.165 కోట్ల మార్క్ దాటేసింది.

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్‌ రాబడుతోంది. దీంతో ఇటీవలే సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో నాని తెలంగాణలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. తన ప్యారడైజ్‌ టీమ్‌తో కలిసి ములుగు జిల్లాలోని శ్రీ సమ్మక్క, సారలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవార‍్ల ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement