breaking news
Vettuvam
-
సంక్రాంతికి వేట్టువం
విభిన్న సమూహాల మధ్య ఉండే సంఘర్షణలు, పోరాటాలు, ఊహకందని సంఘటనల సమాహారంతో రూపొందుతున్న చిత్రం ‘వేట్టువం’. పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్య, వీఆర్ దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరస్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా. రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘పాన్ ఇండియన్ స్థాయిలో భారీ యాక్షన్ మూవీగా ‘వేట్టువం’ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా నేపథ్యాన్ని, పాత్రల స్వభావాలను వివరిస్తూ ఇటీవల రిలీజ్ చేసిన ‘వరల్డ్ ఆఫ్ వేట్టువం’ వీడియోకు మంచి స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
ఐటమ్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్.. ఏ సినిమానో తెలుసా?
రోల్ చిన్నదా,పెద్దదా అన్నది ముఖ్యం కాదు. చిత్రంపై దాని ఇంపాక్ట్ ఉండాలి. ఇటీవల డోరతి చిత్రంలో నటి కీర్తీ సురేశ్ కేవలం మూడు నాలుగు సన్నివేశాల్లోనే కనిపించారు.అయితే చిత్రంలో ఆ పాత్ర ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇకపోతే నటి శృతిహాసన్ కూడా చాలా డేరింగ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పవచ్చు. హీరోయిన్గా నటించినా, ప్రత్యేక పాటల్లో నటించినా గ్లామర్ ను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనుకాడరు. అలా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు.తాజాగా ఒక క్రేజీ చిత్రంలో ప్రత్యేక పోషించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తంగలాల్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రం తరువాత దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం వేట్టువన్. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రేష్మి యో ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అట్టకత్తి దినేష్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్నారు.అశోక్ సెల్వన్, కళైయరసన్, విఘ్నేష్, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటి శోభిత ధూళిపాళ హీరోయిన్గా నటిస్తోంది.(ఇది చదవండి: గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో వైరల్)ఈ చిత్రం ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ కథాంశంతో రూపొందుతోంది. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. వర్డ్ ఆఫ్ వేట్టువన్ పేరుతో ఇటీవల చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు.అయితే ఇప్పుడు కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నటి శృతిహాసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందని సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది యూనిట్ వర్గాలు అధికారికంగా వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే శృతిహాసన్ నటుడు విజయ్ సేతుపతి జంటగా నటించిన ట్రైన్ చిత్రం డిసెంబర్ 4వ తేదీన తెరపైకి రానుంది. -
శోభిత కొత్త సినిమా.. కోడలిపై నాగార్జున ప్రశంసలు
అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వెట్టువం. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రాచీన యుద్ధ కళలను చూపించారు. ఈ సీన్స్ కోసం నటీనటులు యుద్ధ కళలు నేర్చుకున్నారని వెల్లడించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.ఈ మూవీ శోభిత రోల్ మరింత ఇంట్రెస్టింట్‌గా ఉండనుందని ఈ వీడియోలో చూస్తే అర్థమవుతోంది. ఇది వీక్షించిన హీరో నాగార్జున.. కోడలిపై ప్రశంసలు కురిపించారు. శోభిత పడుతున్న కష్టాన్ని ప్రశంసించారు. ఈ మూవీ కోసం ఆత్మరక్షణ కళలను నేర్చుకున్న శోభితన ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం శోభిత చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది.. వెట్టువం వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని నాగ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో శోభిత రాధి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)


