రోల్ చిన్నదా,పెద్దదా అన్నది ముఖ్యం కాదు. చిత్రంపై దాని ఇంపాక్ట్ ఉండాలి. ఇటీవల డోరతి చిత్రంలో నటి కీర్తీ సురేశ్ కేవలం మూడు నాలుగు సన్నివేశాల్లోనే కనిపించారు.అయితే చిత్రంలో ఆ పాత్ర ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇకపోతే నటి శృతిహాసన్ కూడా చాలా డేరింగ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పవచ్చు. హీరోయిన్గా నటించినా, ప్రత్యేక పాటల్లో నటించినా గ్లామర్ ను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనుకాడరు. అలా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు.
తాజాగా ఒక క్రేజీ చిత్రంలో ప్రత్యేక పోషించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తంగలాల్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రం తరువాత దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం వేట్టువన్. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రేష్మి యో ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అట్టకత్తి దినేష్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్నారు.అశోక్ సెల్వన్, కళైయరసన్, విఘ్నేష్, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటి శోభిత ధూళిపాళ హీరోయిన్గా నటిస్తోంది.
(ఇది చదవండి: గ్రాండ్గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో వైరల్)
ఈ చిత్రం ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ కథాంశంతో రూపొందుతోంది. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. వర్డ్ ఆఫ్ వేట్టువన్ పేరుతో ఇటీవల చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు.అయితే ఇప్పుడు కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నటి శృతిహాసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందని సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది యూనిట్ వర్గాలు అధికారికంగా వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే శృతిహాసన్ నటుడు విజయ్ సేతుపతి జంటగా నటించిన ట్రైన్ చిత్రం డిసెంబర్ 4వ తేదీన తెరపైకి రానుంది.


