గ్రాండ్‌గా రష్మిక క్లోజ్‌ ఫ్రెండ్‌ సీమంతం.. వీడియో వైరల్ | Bigg Boss Beauty Prerana Kambham Baby Shower video goes Viral | Sakshi
Sakshi News home page

రణబాలి స్టైల్లో బిగ్‌బాస్ బ్యూటీ సీమంతం.. వీడియో వైరల్

Oct 15 2026 9:17 AM | Updated on Oct 15 2026 9:17 AM

Bigg Boss Beauty Prerana Kambham Baby Shower video goes Viral

బిగ్‌బాస్ బ్యూటీ, హీరోయిన్ రష్మిక స్నేహితురాలు ఫేమ్ ప్రేరణ కంభం ఇటీవలే తాను అభిమానులు గుడ్ న్యూస్ చెప్పింది. తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన భర్తతో కలిసి బేబి బంప్ చూపిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రేరణకు కంగ్రాట్స్ చెప్పారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. రణబాలి మూవీలో జయమ్మ పాత్ర సాంగ్‌తో ఈ వీడియోను పంచుకుంది. ఏందయ్యా సామీ అంటూ సాగే పాటను పోస్ట్ చేసింది. ప్రేరణకు రష్మిక ఫ్రెండ్ కావడంతో ఈ వేడుకను మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కాగా.. స్వతహాగా కన్నడ అయిన ప్రేరణ.. నటి అయ్యే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రష్మికకు స్నేహితురాలు. తర్వాత కాలంలో రష్మిక హీరోయిన్ అయిపోగా.. ప్రేరణ సీరియల్ హీరోయిన్‌గా మారింది. 'కృష్ణ ముకుంద మురారీ' అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తర్వాత బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో పాల్గొంది. ఫినాలే వరకు వచ్చినప్పటికీ టాప్-4లో మాత్రమే చోటు దక్కించుకుంది. ఆ తర్వాత తన భర్త శ్రీపాద్‌తో కలిసి ఓంకార్ హోస్ట్ చేసిన 'ఇస్మార్ట్ జోడీ 3' రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. 2023 నవంబరులో వీళ్లిద్దరికీ పెళ్లి జరిగింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement