శోభిత కొత్త సినిమా.. కోడలిపై నాగార్జున ప్రశంసలు | Nagarjuna Praises Sobhita dhulipala For Vettuvam Movie Role | Sakshi
Sakshi News home page

Nagarjuna: శోభిత కొత్త సినిమా.. కోడలిపై నాగార్జున ప్రశంసలు

Sep 20 2026 3:00 PM | Updated on Sep 20 2026 3:00 PM

Nagarjuna Praises Sobhita dhulipala For Vettuvam Movie Role

అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వెట్టువం. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ​పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ  నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రాచీన యుద్ధ కళలను చూపించారు. ఈ సీన్స్ కోసం నటీనటులు యుద్ధ కళలు నేర్చుకున్నారని వెల్లడించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

ఈ మూవీ శోభిత రోల్‌ మరింత ఇంట్రెస్టింట్‌గా ఉండనుందని ఈ వీడియోలో చూస్తే అర్థమవుతోంది. ఇది వీక్షించిన హీరో నాగార్జున.. కోడలిపై ప్రశంసలు కురిపించారు. శోభిత పడుతున్న కష్టాన్ని ప్రశంసించారు. ఈ మూవీ కోసం ఆత్మరక్షణ కళలను నేర్చుకున్న శోభితన ఉద్దేశించి ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ సినిమా కోసం శోభిత చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది..  వెట్టువం వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని నాగ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో శోభిత రాధి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement