‘పదో తరగతి కలిసి చదివాం.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’ | Itlu Arjun Teaser Launch, Manasa Sharma Gets Emotional While Recalling Her Childhood Friendship With Director Mahesh Uppala | Sakshi
Sakshi News home page

Manasa Sharma : ఆ డైరెక్టర్‌ కోసం చెప్తూ మానస ఎమోషనల్‌

Sep 20 2026 12:07 PM | Updated on Sep 20 2026 1:41 PM

Itlu Arjuna Teaser Launch Event Director Manasa Sharma Speech

అనీష్, అనస్వర రాజన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.  ఈవెంట్‌కు హాజరైన లేడీ డైరెక్టర్‌ మానస శర్మ దర్శకుడు మహేష్ ఉప్పాల గురించి మాట్లాడే సమయంలో బాగా ఎమోషనల్ అయ్యారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం గురించి మాట్లాడుతూ... ‘నేను, మహేశ్‌ పదో తరగతి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మేం క్లాస్‌మేట్స్. పదో తరగతిలో ఉన్నప్పుడు ఫిల్మ్‌ మేకర్స్ అవ్వాలని అనుకున్నాం.  ఈ రోజు నేను రాకాస డైరెక్టర్‌ని.  మహేశ్‌ కూడా ‘ఇట్లు అర్జున’ దర్శకుడు అయ్యాడు. నిజంగా నా జీవితంలో అత్యంత హ్యాపీ మూమెంట్ ఇదే. నేను 'రాకాస' కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదేమో అని కన్నీరు పెట్టుకున్నారు.  

 ఇదీ చదవండి: మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement