మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది | Itlu Arjuna Teaser Launch, Anish Opens Up About His Challenging Silent Role And Unique Action, Check Details Inside | Sakshi
Sakshi News home page

మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది: మానసా శర్మ

Sep 20 2026 11:32 AM | Updated on Sep 20 2026 12:51 PM

Itlu Arjuna Teaser Release Event Highlights

అనీష్, అనస్వర రాజన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనీష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అర్జున పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యాను. ఇందులో యాక్షన్‌ కొత్తగా ఉంటుంది. అర్జున మాటలు మీకు వినిపించక΄ోవచ్చు. తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది’’ అన్నారు.

 ‘‘అర్జున పాత్రను అనీష్‌ చాలెంజ్‌గా తీసుకుని చేశాడు. మానసతో కలిసి ఈ కథను ఇష్టపడి రాశాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు మహేష్‌ ఉప్పల. ‘‘నేను దర్శకుడిగా ఉన్నప్పుడు సీన్‌ గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఇప్పుడు బడ్జెట్‌ గురించి కూడా ఆలోచిస్తున్నాను’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ చిత్రంలోని కీర్తి పాత్రను చాలా ఎంజాయ్‌ చేస్తూ, చేశాను’’ అని చెప్పారు అనస్వర. ‘‘ఈ చిత్రంలో మూగవాడైన అర్జున పాత్రలో అనీష్‌ నటించాడు. ఈ సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’’ అని అన్నారు దర్శకురాలు మానసా శర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement