సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్, వ్యక్తిగత విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై నెటిజన్లు చేసే కామెంట్స్ తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఈ ధోరణిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల తన బాడీపై వచ్చి ట్రోల్స్‌కు హిందీ బిగ్‌బాస్ షోలో కౌంటరిచ్చారు.
నేను ముసలివాణ్ని అయిపోయానా..
‘నేను ముసలివాణ్ని అయిపోయాను అంటున్నారు’ అని షర్ట్ విప్పి బాడీ చూపించారు. మొఖానికి ఉన్న మేకప్ సైతం చెరిపేశారు.‘దమ్ముంటే ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి’ అన్నట్టుగా సవాల్ విసిరారు. తనను విమర్శించే ముందు ఎవరికి వాళ్లు వారి మొఖాలు, బాడీ చూసుకోవాలని తెలిపారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్
కత్రినాపై బాడీ షేమింగ్..
కత్రినా కైఫ్ బాడీ షేమింగ్‌కు గురైన విషయాన్ని ట్రోలర్స్‌కు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళల శరీరంలో గర్భధారణ సమయంలో అనేక మార్పులు రావడం సహజమేనని, బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వారు మునుపటి శరీరాకృతికి తిరిగి రావాలని ఆశించడం సరికాదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను వారి శరీరాకృతి, వయసు లేదా వ్యక్తిగత విషయాల ఆధారంగా విమర్శించడం సరికాదనే సందేశాన్ని సల్మాన్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. ముఖ్యంగా తల్లులుగా మారిన హీరోయిన్ల విషయంలో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవాలని సూచించారు. సినిమాల్లోకి తిరిగి వచ్చినప్పుడు వారు తమకు అనుకూలమైన సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతారని చెప్పారు.
ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్ బద్దలయ్యేలా ప్లాన్!
STANDING OVATION!#SalmanKhan took off his T-shirt, showed his body and challenged if you want to troll, go ahead and do it.
He just shut the haters up again. He doesn’t care about trolling #BiggBoss20 pic.twitter.com/YGbVM8X9om
— Devil V!SHAL (@VishalRC007) September 19, 2026


