breaking news
Manasa Sharma
-
‘పదో తరగతి కలిసి చదివాం.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకుడు మహేష్ ఉప్పాల గురించి మాట్లాడే సమయంలో బాగా ఎమోషనల్ అయ్యారు.చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం గురించి మాట్లాడుతూ... ‘నేను, మహేశ్ పదో తరగతి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మేం క్లాస్మేట్స్. పదో తరగతిలో ఉన్నప్పుడు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని అనుకున్నాం. ఈ రోజు నేను రాకాస డైరెక్టర్ని. మహేశ్ కూడా ‘ఇట్లు అర్జున’ దర్శకుడు అయ్యాడు. నిజంగా నా జీవితంలో అత్యంత హ్యాపీ మూమెంట్ ఇదే. నేను 'రాకాస' కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదేమో అని కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది -
మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అనీష్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను చేసిన అర్జున పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో యాక్షన్ కొత్తగా ఉంటుంది. అర్జున మాటలు మీకు వినిపించక΄ోవచ్చు. తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘అర్జున పాత్రను అనీష్ చాలెంజ్‌గా తీసుకుని చేశాడు. మానసతో కలిసి ఈ కథను ఇష్టపడి రాశాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు మహేష్ ఉప్పల. ‘‘నేను దర్శకుడిగా ఉన్నప్పుడు సీన్ గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఇప్పుడు బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ చిత్రంలోని కీర్తి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ, చేశాను’’ అని చెప్పారు అనస్వర. ‘‘ఈ చిత్రంలో మూగవాడైన అర్జున పాత్రలో అనీష్ నటించాడు. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అని అన్నారు దర్శకురాలు మానసా శర్మ. -
ఎవరీ మానస శర్మ? అచ్చం ఓయ్ హీరోయిన్లా ఉందే!
గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం తనే ఉంది. చూడటానికి అమాయకంగా, సాంప్రదాయంగా కనిపిస్తూ తెగ వైరలవుతోంది. ఆ తను మరెవరో కాదు రాకాస దర్శకురాలు మానస శర్మ. చూడటానికి ఓయ్ సినిమా హీరోయిన్ షామిలికి చెల్లెలిగా కనిపిస్తున్న ఈవిడ గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. కాబట్టి ఆమె ఎవరు? ఇంతకు ముందు ఏం చేసింది? అనేది ఓసారి చూసేద్దాం..రచయితగామానస శర్మది శ్రీకాకుళం.. యూట్యూబ్‌లో మ్యాడ్ హౌస్ అనే మినీ సిరీస్‌కు డైలాగ్స్ రాసింది. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు రచయితగా పని చేసింది. ఈ రెండింటికీ మెగా డాటర్ నిహారిక కొణిదెలయే నిర్మాతగా వ్యవహరించింది. అలా నిహారిక దృష్టిలో పడింది. 2024లో సోనీ లివ్‌లో వచ్చిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్‌తో దర్శకురాలిగా మారింది. తర్వాత మరోసారి నిహారికతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఆమె నిర్మించిన రాకాస చిత్రంతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం కాబోతోంది.ట్రెండింగ్‌లో డైరెక్టర్రాకాస మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక కన్నా దర్శకురాలు మానసయే ఎక్కువ హైలైట్ అవుతోంది. మాట్లాడేది తక్కువే అయినా అమాయకత్వం, సింపుల్ స్మైల్‌తో ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. ఓయ్ హీరోయిన్లా కనిపించినప్పటికీ ఆమెకు, మానసకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపోతే జనాలు గుర్తుపెట్టుకునేలా, వారికి నచ్చేలా సినిమాలు తీయాలనుకుంటుంది మానస. మరి ఆమె రాకాసతో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి!నేను చాలా ఇంట్రోవర్ట్. కెమెరా అంటే మొహమాటం ఎక్కువ. అందుకే కెమెరా వెనకాల ఉండటానికే ప్రయత్నిస్తాను.- మానస శర్మ View this post on Instagram A post shared by YouWe Media (@youwemedia) చదవండి: భార్య ఉండగా రెండో పెళ్లి.. బిడ్డ తనకు పుట్టలేదన్న నటుడికి షాకిచ్చిన డీఎన్ఏ రిపోర్ట్


