ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌.. ట్రైలర్ రిలీజ్ | Actor Vijay Varma Matka King Web Series Official Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Matka King Trailer: ఓటీటీకి మట్కా కింగ్ సిరీస్‌.. ట్రైలర్ రిలీజ్

Apr 7 2026 4:21 PM | Updated on Apr 7 2026 4:57 PM

Vijay Varma Matka King web series Official Trailer out now

తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్‌కు సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో   కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే.  

తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్‌ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్‌ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement