
హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia), నటుడు విజయ్ వర్మ (Vijay Varma) మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. త్వరలోనే పెళ్లి చేసుకుని జంటగా ఒక్కటవుతారనుకుంటే అంతలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని తెలుస్తోంది. ప్రేమికులుగా కాకుండా ఇకపై స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ బ్రేకప్ రూమర్స్ తమన్నా, విజయ్ ఎవరూ స్పందించనేలేదు.
రిలేషన్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొద్దు
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన తమన్నా ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమకు ఎలాంటి షరతులు ఉండకూడదు. ఇది కేవలం ప్రేమజంటకే కాదు, పేరెంట్స్, ఫ్రెండ్స్, మన పెంపుడు జంతువులు.. ఇలా అన్నింటికీ వర్తిస్తుంది. నీ పార్ట్‌నర్‌పై నువ్వు అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావడంటే అప్పుడా బంధం బిజినెస్‌గా మారుతుంది. నేనిలా అనుకుంటే నువ్విలా చేశావ్.. నేను చెప్పినవాటిలో కొన్నే చేశావ్.. ఇలా లిస్టు తయారుచేసుకోవాల్సి వస్తుంది.

వ్యాపార లావాదేవిగా మార్చొద్దు
ప్రేమకు, రిలేషన్‌కు మధ్య తేడా ఉంది. ప్రేమ పుట్టాకే రిలేషన్‌షిప్ మొదలవుతుంది. ఆ ప్రేమ షరతులు లేకుండా ఉండాలి. కొన్నిసార్లు అది ఏకపక్షం కూడా కావచ్చు. అయితే నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆశిస్తే అది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే! నేను ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిలేస్తాను. వారికి నచ్చినట్లుగా బతకనిస్తాను.
తెలివిగా ఆలోచించండి
సింగిల్‌గా ఉన్నప్పటి కంటే రిలేషన్‌లో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఒక తోడు దొరికితే అంతకుమించిన సంతోషం ఏముంటుంది. కానీ ఎవర్ని ఎంచుకుంటున్నావన్నది ముఖ్యం.. ఎందుకంటే వారు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలివిగా ఆలోచించి ముందడుగు వేయండి అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్