
పాన్ ఇండియా రేంజ్‌లో అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నటి తమన్నా ఐటెం సాంగ్స్‌తో మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. రీసెంట్‌గా ఆమె నటించిన ఐటెం సాంగ్స్ అంతగా అభిమానుల్లో ప్రభావం చూపాయి. అలాంటి పాటలకు తమన్నా పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేస్తారనే టాక్ ఉంది. ఏకంగా ఒక్కో పాటకు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటారని టాక్ ఉంది. 18 ఏళ్ల వయసులోనే నటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా రాణించిన ఈ ఉత్తరాది భామకు సమీప కాలంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కూడా స్వయం కృతాపరాధమే అని చెప్పవచ్చు.
కెరీర్లో పెద్దగా వదంతులను ఎదుర్కొనని తమన్నా ఈమధ్య అలాంటి వాటిని ఎదుర్కోవడం గమనార్హం. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగించిన తరువాతే ఈ మిల్కీ బ్యూటీపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. విందుకు వినోదాలకు ఈ జంట కలిసి తిరగడమే ఇందుకు కారణం. అయితే, చాలామంది నటిమణులు ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు తమన్నా కూడా ఎదుర్కొంటున్నారు. తను ప్రేమించిన విజయ్‌వర్మ నుంచి విడిపోవడం వంటి వార్తలు ఇందుకు కారణం. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఆపై వారు జంటగా ఈ మధ్య ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
కాగా ఇటీవల ఈమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో కొన్ని ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేసి వేదాంతపు వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రతి తప్పు పాఠాన్ని నేర్పిస్తుంది. మెరిసే ప్రతి వస్తువు వెనుక ఒక మెరవని కార్యం ఉంది. నిర్ణయాలు, సంతోషాలు ఇవే ఆ కార్యాలు. అంటూ చెప్పిన ఈ బ్యూటీ మరోసారి ఇలా చెప్పింది 'జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దని ఆమె కోరారు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలి' అన్నారు. మొత్తం మీద ఈమెకు ఏదో ఒక అనుభవం పెద్ద పాఠాన్నే నేర్పించిందని అర్థమవుతోంది. అది ప్రేమలో విఫలం కావడమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద తమన్న ఆమధ్య కొంచెం బరువెక్కి ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా తయారైంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో తెలుగులో ఒక చిత్రం ,హిందీలో ఒక చిత్రం, మరో వెబ్ సిరీస్ ఉన్నాయి.