స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వాటిని రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన వాటికి కూడా డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ ప్రముఖ నటుడు బాత్రూంలో కమోడ్‌ని బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు దాంతో ఓ నటుడు సెల్ఫీ దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)
తెలుగులో 'ఎమ్‌సీఏ' సినిమాలో విలన్‌గా చేసిన విజయ్ వర్మ.. ప్రస్తుతం హిందీలో మూవీస్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కొన్నాళ్ల ముందు వరకు హీరోయిన్ తమన్నాతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఇతడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాడు. అయితే ఈ సెల్ఫీని 2016లో తీసుకున్నాడు. రీసెంట్ వైరల్ ట్రెండ్ దృష్టా.. ఇప్పుడు ఆ ఫొటోని పోస్ట్ చేశాడు.
2016 నాకు మైలురాయి లాంటిది. బిగ్ బీ, సుజిత్ సర్కార్‌లతో 'పింక్' సినిమా చేశాను. నా దేవుడు సచిన్‌ని కలిశాను. బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాను అని విజయ్ వర్మ రాసుకొచ్చాడు. అలానే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ని తన అభిమాన హీరోగానూ వర్ణిస్తూ ఆయనతో దిగిన ఫొటోను కూడా విజయ్ వర్మ షేర్ చేశాడు.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?)


