'వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' అనేది పాత సామెత అయ్యిండొచ్చు. కానీ ఏ తరానికి అయినా కచ్చితంగా పనికొచ్చేదే. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు వరసగా గ్లామరస్ మూవీస్ చేస్తారు. కొన్నాళ్లకు పూర్తిగా తెరమరుగైపోతుంటారు. కొందరు మాత్రం తన తలరాత మారుతుందని చెప్పి కొన్ని ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంటారు. తీరా చూస్తే అవి అడియాశలు అవుతుంటాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.
(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)
స్టార్ హీరో సినిమాలో నటించారని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. అందుకు తగ్గట్లే చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ అదృష్టం కలిసొచ్చి ఫేట్ మారేది మాత్రం అతికొద్ది మందికే. మరికొందరికి మాత్రం ఘోరమైన దురదృష్టం తప్పితే మరొకటి మిగలదు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అలానే పవన్ కల్యాణ్, ప్రభాస్‌లపై బోలెడంత నమ్మకం పెట్టుకుంది. నాలుగేళ్ల విలువైన సమాయాన్ని వెచ్చించింది. మరో సినిమా చేయలేదు. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.
2017లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2022 వరకు తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఎనిమిది సినిమాల వరకు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. 2019లో అలా పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటించే ఛాన్స్ నిధికి వచ్చింది. లాక్‌డౌన్, పవన్ రాజకీయాల వల్ల సినిమా చాలా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ చిత్రం నిధికి ఏ మాత్రం ఉపయోగపడలేదు.
(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్)
రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్'లోనూ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్‌గా చేసింది. దాదాపు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం తనకు ఫేట్ మార్చేస్తుందని, హిట్ అవుతుందని నిధి చాలా నమ్మింది. కానీ బ్యాడ్ లక్. ఇది కూడా ఫ్లాప్ అయింది. సరేలే ఈ రెండు మూవీస్ ఫెయిలైతే అయ్యాయి అనుకోవచ్చు. వీటిలో నిధి అగర్వాల్ పాత్రలు ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా ఉండవు. దీంతో ఈ విషయంలోనూ ఈమెకు పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు.
నిధి అగర్వాల్ ఇప్పటికైతే ఏ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు అయితే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక, శ్రీలీల, భాగ్యశ్రీ, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వీళ్లు కాకుండా రుక్మిణి వసంత్, మృణాల్ ఠాకుర్ లాంటి బ్యూటీస్.. స్టార్ హీరోలకు మెయిన్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి ఈ ముద్దుగుమ్మలని దాటుకుని నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటుందా? అనేది చూడాలి. ఒకవేళ లేదంటే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పరంగా వెనకబడిపోయే ప్రమాదముంది!
(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)


