మొన్న బ్రేకప్.. ఇప్పుడేమో పెళ్లి గురించి అడిగితే? | Tamannaah Bhatia Questioned About Her Marriage Latest | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: పెళ్లి టాపిక్.. క్లారిటీ ఇచ్చిన తమన్నా

Apr 14 2025 1:51 PM | Updated on Apr 14 2025 3:00 PM

Tamannaah Bhatia Questioned About Her Marriage Latest

హీరోయిన్లు ప్రేమ-పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందేమోనని భయం, కొన్నిసార్లు బ్రేకప్ వల్ల కూడా పెళ్లి చేసుకోవడం చాలా లేటు చేస్తుంటారు. మొన్నీమధ్య బ్రేకప్ అయిన తమన్నాని ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే ఏం సమాధానమిచ్చిందో తెలుసా?

దాదాపు 20 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న తమన్నా.. దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు-ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని తెగ రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్లు కలిసి చాలాసార్లు కనిపించారు.

(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?)

మరి ఏమైందో ఏమో గానీ కొన్నిరోజుల క్రితం వీళ్ల బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది. అది నిజమేనని కొన్ని సంఘటనల ద్వారా క్లారిటీ వచ్చింది. తాజాగా ఓదెల 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా తమన్నాని పెళ్లెప్పుడు అని అడిగితే.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పింది.

తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. మరి ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పిందా? లేదంటే మొత్తానికి ఒంటరిగా ఉండిపోతుందా అని అభిమానులు అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement