విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్‌ ఇవ్వడంతో..: హీరోయిన్‌ | Fatima Sana Shaikh Gives Clarity On Relationship Rumours With Vijay Varma And Comments About Relations And Multiple Seizures | Sakshi
Sakshi News home page

Fatima Sana Shaikh: విజయ్‌ వర్మతో డేటింగ్‌ రూమర్స్‌పై హీరోయిన్‌ క్లారిటీ.. మూర్ఛ వ్యాధి వల్ల..

Jun 26 2025 10:49 AM | Updated on Jun 26 2025 11:44 AM

Fatima Sana Shaikh about Relations and Multiple Seizures

బాలీవుడ్‌ హీరో విజయ్‌ వర్మ.. తమన్నాకు బ్రేకప్‌ చెప్పాక మరో హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దంగల్‌ బ్యూటీ ఫాతిమా సనా షైఖ్‌ (Fatima Sana Shaikh)తో పలుమార్లు కనిపించడంతో వీళ్లు లవ్‌ బర్డ్స్‌ అయుండొచ్చని పలువురూ అభిప్రాయపడ్డారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదంటోంది ఫాతిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. 

సింగిల్‌ లైఫ్‌
కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్‌ అవ్వాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం విజయవంతంగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ సింగిల్‌ అని వెల్లడించింది. అలాగే తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. నాకు మూర్ఛ రోగం (Epilepsy) ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా మూర్ఛ వచ్చింది. దాంతో నన్ను ఎయిర్‌పోర్ట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. 

ఫిట్స్‌ వచ్చి పడిపోయా
అయినా మూర్ఛ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారు. దానివల్ల నా శరీరం ఎఫెక్ట్‌ అయింది. బెడ్‌రెస్ట్‌ తీసుకోక తప్పలేదు. అప్పుడు నా చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటి షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. షూటింగ్‌కు రమ్మని పిలిచినప్పుడు బాధ తట్టుకోలేక ఏడ్చేశాను. నాకున్న మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యాను. అప్పుడే నాకు ఫిట్స్‌ ఉన్నట్లు వెల్లడించాను అని చెప్పుకొచ్చింది. ఫాతిమా.. మాధవన్‌ సరసన ఆప్‌ జైసా కోయ్‌ మూవీలో నటించింది. ఈ చిత్రం జూలై 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఫాతిమా నటించిన మరో చిత్రం 'మెట్రో ఇన్‌ డినో' జూలై 4న థియేటర్లలో రిలీజవుతోంది.

చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌

Advertisement
 
Advertisement
Advertisement