తమన్నా తప్పించుకుంది.. బాయ్‌ఫ్రెండ్ సీరియస్ అయ్యాడు! | Vijay Varma Gets Angry At Pap For Asking About His Maldives Vacation With Tamannaah Bhatia; Video Viral - Sakshi
Sakshi News home page

Tamannah Vijay Verma: కొంటె ప్రశ్న.. హర్ట్ అయిన తమన్నా బాయ్‌ఫ్రెండ్!

Published Fri, Sep 1 2023 1:51 PM | Last Updated on Fri, Sep 1 2023 2:55 PM

Vijay Varma Serious In Airport Maldives Vacation Tamannaah - Sakshi

స్టార్ హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉంది. ఇప్పటికే ఈ బంధం గురించి అందరికీ తెలుసు. అయితే పెళ్లెప్పుడు? అని అడిగితే మాత్రం అప్పుడు-ఇప్పుడు అని ఇద్దరూ ఆ టాపిక్ దాటవేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటిది వీళ్లని తాజాగా ఓ వ్యక్తి.. కొంటె ప్రశ్న వేసి ఇరకాటంలో పడేశాడు. దీంతో విజయ్ సీరియస్ అయ్యాడు.

(ఇదీ చదవండి: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు)

ఓసారి షూటింగ్‌లో భాగంగా పరిచయమైన తమన్నా-విజయ్ వర్మ.. కొన్నాళ్లకు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది న్యూయర్ సందర్భంగా వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. అప్పటినుంచి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ జంటగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ లేదా లవర్స్ అనేది పక్కనబెడితే తాజాగా మాల్దీవులు వెళ్లొచ్చారు.

అయితే ఎయిర్‌పోర్ట్‌లో దిగి నడిచి వస్తుండగా.. అక్కడే ఉన్న అభిమానులు తమన్నా వెంటపడ్డారు. వెకేషన్ ఎలా జరిగింది, విజయ్ సర్ రాలేదా అని అడిగే ప్రయత్నం చేశారు కానీ ఆమె పెద్దగా రెస్పాండ్ కాకుండా వెళ్లిపోయింది. కాసేపటి విజయ్ వర్మ బయటకొచ్చాడు. దీంతో అతడిని.. 'మాల్దీవుల్లో బాగా మజా చేశారా?' అని కొంటెగా ఓ వ్యక్తి అడిగాడు. ఈ క్వశ్చన్ పై సీరియస్ అయిన ఇతడు.. 'మీరు అలా మాట్లాడకూడదు' అని సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

(ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement