కొత్త బ్యూటీతో విజయ్‌ డేటింగ్‌.. ఎవరీ అలియా? | After Breakup With Tamannaah, Vijay Varma Spotted With Aaliyah Qureishi | Sakshi
Sakshi News home page

తమన్నాతో బ్రేకప్‌.. అలియాతో విజయ్‌ డేటింగ్‌..ఎవరీ భామ?

Apr 23 2026 5:47 PM | Updated on Apr 23 2026 6:59 PM

After Breakup With Tamannaah, Vijay Varma Spotted With Aaliyah Qureishi

సినీ తారలకు ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో.. బ్రేకప్‌, విడాకులు కూడా అంతే కామన్‌. ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడతారో..ఎందుకు విడిపోతారో  తెలియదు. ఇలా ప్రేమ విషయాన్ని బయటపెట్టి..అలా బ్రేకప్‌ చెప్పుకుంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి.. కొన్నాళ్లకే బ్రేకప్‌ అయిపోయిందటారు. అలా విడిపోయి సడెన్‌ షాక్‌ ఇచ్చిన వారిలో విజయ్‌ వర్మ-తమన్నా జంట ఒకటి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. కొన్నాళ్ల క్రితం విడిపోయి అందరికి షాకిచ్చింది.  

తమన్నాతో బ్రేకప్‌ తర్వాత విజయ్‌ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దంగల్‌ బ్యూటీ ఫాతిమా సనాతో ప్రేమలో పడ్డాడనే వార్తకు కూడా వినిపించాయి. కానీ ఫాతిమా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాత విజయ్‌ మరో యంగ్‌ బ్యూటీతో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వాలెంటైన్స్‌ డే రోజు ఓ అమ్మాయి చేతిలో చేయి వేస్తున్న ఫోటోని షేర్‌ చేసి..దానికి లవ్‌ ఎమోజీనీ జోడించాడు. ఈ పోస్ట్‌ని  ఖుషి అహుజా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు.

తాజాగా ఆ బ్యూటీ పేరు బయటకు వచ్చింది. విజయ్‌ వర్మ ప్రస్తుతం నటి అలియా ఖురేషితో రిలేషనల్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నరానే పుకార్లు బయటకు వచ్చాయి.

ఎవరీ ఖురేషీ?
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్‌లో ‘జాన్వి’పాత్రలో మెరిసిన బ్యూటీనే అలియా ఖురేషి. నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్‌స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు.  ప్రముఖ మ్యూజికల్ సిరీస్ 'బందిష్ బాండిట్స్' రెండవ సీజన్‌లో అనన్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇభ్రహీం అలీఖాన్‌, ఖుషీ కపూర్‌ల ‘ నదానియన్’ మూవీలో కీలక పాత్ర పోషించింది.  మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో ఉన్నారా? లేక జస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమేనా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement