తమన్నా-విజయ్‌ బ్రేకప్‌.. సలహా ఇచ్చిన చిరంజీవి? | Is Chiranjeevi Convince Tamannaah Bhatia to Announce Breakup with Vijay Varma | Sakshi
Sakshi News home page

Chiranjeevi: బ్రేకప్‌.. చెప్పమని తమన్నాకు సలహా ఇచ్చిన చిరంజీవి?!

Apr 13 2025 12:09 PM | Updated on Apr 13 2025 1:43 PM

Is Chiranjeevi Convince Tamannaah Bhatia to Announce Breakup with Vijay Varma

మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా (Tamannaah Bhatia)- విజయ్‌ వర్మ (Vijay Varma) కొంతకాలం క్రితమే బ్రేకప్‌ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు షాకయ్యారు. అయితే ఈ బ్రేకప్‌ను బాహాటంగా ప్రకటించమని మెగాస్టార్‌ చిరంజీవి సలహా ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

చిరంజీవి సలహా
రిపబ్లిక్‌ వరల్డ్‌ కథనం ప్రకారం.. ఈ ఏడాది తమన్నా- విజయ్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల గురించి తండ్రి ఆరా తీయగా తమన్నా నిరాసక్తత చూపించింది. తనకు ఇష్టం లేదని తెలిపింది. విజయ్‌ తనకు కట్టుబడి ఉన్నట్లు అనిపించడం లేదని పేర్కొంది. అతడి ఒత్తిడి వల్లే మీడియా ముందు పలుమార్లు జంటగా కలిసి కనిపించామని బాధపడింది. మరి.. ఈ బ్రేకప్‌ వార్తను జనాలకు ఎలా చెప్పగలవు? అని పేరెంట్స్‌ అడగ్గా.. చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) జోక్యం చేసుకుని బ్రేకప్‌ న్యూస్‌ను మీడియాకు వెల్లడిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.

చిరంజీవి జోక్యం నిజమా?
ఇది చూసిన నెటిజన్లు.. వాళ్లిద్దరి మధ్యలో చిరంజీవి ఎందుకు జోక్యం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా నమ్మేట్లుగా లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో బ్రేకప్‌ను దాచడం వల్ల ఒరిగేదేముంది.. ఉన్న విషయం బయటకు చెప్పమని చిరు సలహా ఇచ్చినట్లున్నాడు.. అందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement