హీరోయిన్ తమన్నాతో డేటింగ్‌తో ఆ మధ్య వార్తల్లో నిలిచాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma). ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపించేవారు. కానీ, సడన్‌గా బ్రేకప్ చెప్పుకుని అందరికీ షాకిచ్చారు. ఇద్దరూ విడిపోయి ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్.. గతంలో డిప్రెషన్‌తో బాధపడిన విషయాన్ని బయటపెట్టాడు. నటి రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో అతడు మాట్లాడుతూ.. ముంబైలోని నా అపార్ట్‌మెంట్‌లో ఒక్కడినే ఉంటాను.
పిచ్చోడినయ్యా..
అక్కడ ఒక చిన్న టెర్రస్ ఉండేది. అక్కడ ఆకాశాన్ని చూస్తూ గడిపేవాడిని. లేదంటే నాకు పిచ్చిపట్టేదేమో! నిజం చెప్పాలంటే పిచ్చోడ్నయ్యాను కూడా.. షూటింగ్స్ అంటూ ఎప్పుడూ పరిగెత్తే నాకు సడన్‌గా బ్రేక్ వచ్చింది. అప్పుడు నా చుట్టూ ఒంటరితనం ఆవరించింది. ఎందుకో భయమేసేది. గదిలో నుంచి బయటకు రాకపోయేవాడిని. రోజుల తరబడి సోఫాకే ఎందుకు అతుక్కుపోయేవాడినో నాకే తెలిసేది కాదు.. ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

ఆమిర్ కూతురి వల్లే..
అలాంటి సమయంలో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ (Ira Khan), నటుడు గుల్షన్ దేవయ్య నాకు అండగా నిలబడ్డారు. దహాడ్ వెబ్ సిరీస్ షూటింగ్‌లోనే మేము ముగ్గురం ఫ్రెండ్సయ్యాం. అప్పుడప్పుడు వీడియో కాల్ చేసుకునేవాళ్లం, కలిసి డిన్నర్‌కు వెళ్లేవాళ్లాం. అప్పటికీ నా మనసు బాగోలేదు. ఆ విషయం ఇరా పసిగట్టింది. ఇలా ఆగిపోకు, ముందుకు సాగాలని భుజం తట్టింది. వీడియోకాల్‌లో వర్కవుట్స్ చేయించింది.
డిప్రెషన్
ఓ థెరపిస్ట్‌తో మాట్లాడినప్పుడు నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ధ్యానం చేయమని సూచించాడు. అదే విషయం తనకు చెప్పి దాన్నుంచి బయటకు వచ్చేందుకు నేనే ప్రయత్నిస్తానన్నాను. అలా సూర్య నమస్కారాలు, యోగా ద్వారా ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పుకొచ్చాడు. విజయ్ చివరగా ఐసీ 814: ద కాందహర్ హైజాక్ వెబ్ సిరీస్‌లో, మర్డర్ ముబారక్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు నటించిన గుస్తాఖ్ ఇష్క్ నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది.
చదవండి: మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం


