Vijay Varma Reacts After Fan Says Tamannaah Is Everything - Sakshi
Sakshi News home page

Vijay Varma - Tamanna: 'నాకు అన్నీ తమన్నానే'.. నెటిజన్‌కు విజయ్ వర్మ రిప్లై!

Jun 19 2023 9:09 PM | Updated on Jul 31 2023 8:28 PM

Vijay Varma reacts after fan says Tamannaah is everything - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది న్యూ ఇయర్‌ వేడుకల్లో గోవాలో కనిపించిన జంట.. ఆ తర్వాత చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు కలిసి లస్ట్‌ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా.. విజయ్‌తో ఉన్న బంధం గురించి తొలిసారి నోరు విప్పారు. విజయ్‌తో లవ్‌లో ఉన్నానని తమన్నా ప్రకటించారు. ఆ తర్వాత విజయ్ వర్మ సైతం తమన్నాతో రిలేషన్‌ నిజమేనని వెల్లడించారు. 

(ఇది చదవండి: Video: డెలివరీ డేట్‌ ఫిక్స్‌...ఆసుపత్రికి ఉపాసన!)

తాజాగా వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఫోటోషూట్‌ నిర్వహించారు. ఆ ఫొటోలను తమన్నా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరలయ్యాయి. ఇవీ చూసిన ఓ నెటిజన్ ' అన్నీ తమన్నానే.. విజయ్ కేవలం ఓ నటుడు' మాత్రమే అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన విజయ్ వర్మ..  'మీ మాటలను అంగీకరిస్తున్నా.. నాకు అన్నీ తమన్నానే' అంటూ రిప్లై ఇచ్చారు. విజయ్ ట్వీట్ చూసిన తమన్నా కూడా రిప్లై ఇస్తూ ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. తమన్నా, విజయ్‌ వర్మ కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ లస్ట్‌ స్టోరీస్‌2 జూన్‌ 29 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. దీని ప్రమోషన్స్‌ కోసం ఈ ప్రేమజంట ప్రత్యేక ఫొటోషూట్‌ చేసింది. 

(ఇది చదవండి: ఆదిపురుష్‌ మూవీ ఓ పెద్ద జోక్‌.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement