రిలీజ్‌కి ముందే జాగ్రత్తపడ్డ 'రామాయణ' మేకర్స్ | Ramayana Movie Issue And Bombay High Court Order | Sakshi
Sakshi News home page

Ramayana Movie: 'రామాయణ'కి పైరసీ బెడద.. హైకోర్ట్ కీలక ఆదేశాలు

Nov 3 2026 1:35 PM | Updated on Nov 3 2026 2:21 PM

Ramayana Movie Issue And Bombay High Court Order

చిన్న పెద్దా సినిమా అని తేడా లేదు. ప్రతిదీ ఇప్పుడు విడుదలైన రోజే పైరసీ బారిన పడుతోంది. ఈ విషయంలో ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. కానీ 'రామాయణ' మేకర్స్ మాత్రం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబే హైకోర్టుకి వెళ్లారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లికి రెడీ ‍అయిన లేడీ సింగర్)

'రామాయణ' పైరసీ బారిన పడకుండా రక్షణ కల్పించాలని గాడ్‌పవర్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. సినిమాని రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం, స్ట్రీమింగ్‌ చేయడంపై నిషేధం విధించింది. అనధికారిక లింకులు, మిర్రర్‌ వెబ్‌సైట్లని గుర్తించి తొలగించాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, సోషల్ మీడియా సంస్థలని ఆదేశించింది. పైరసీ కంటెంట్‌కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే వాటిని బ్లాక్‌ చేయడం, తొలగించడం లాంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ మాధవ్‌ జమ్దార్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

‘రామాయణ’ తొలి భాగాన్ని రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు నిర్మాతలు..‌ కోర్టుకు వెల్లడించారు. రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రివ్యూ స్క్రీనింగ్‌ల్లోనూ కఠిన ఒప్పందాలు అమలు చేసినప్పటికీ రెండు ట్రైలర్లని కొందరు రహస్యంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇలానే మరోసారి పైరసీకి గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్‌ 16న జరగనుంది.

ఈ గురువారమే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి.. రాముడు, సీత పాత్రలు చేశారు. యష్.. రావణుడిగా కనిపించబోతున్నాడు. నితీశ్ తివారీ దర్శకుడు కాగా నమిత్ మల్హోత్రా నిర్మాత.

(ఇదీ చదవండి: బాలకృష్ణతో సినిమా.. రొమాంటిక్ సీన్లపై హీరోయిన్ విమర్శలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement