అమిత్ షాతో చిరంజీవి భేటీ.. ఆ విషయంలో హామీ | Actor Chiranjeevi Met Amit Shah About AI Issue For Celebrities | Sakshi
Sakshi News home page

Chiranjeevi Amit Shah: అమిత్ షాతో చిరు భేటీ.. అందుకే కలిశారా?

Nov 3 2026 2:21 PM | Updated on Nov 3 2026 2:32 PM

Actor Chiranjeevi Met Amit Shah About AI Issue For Celebrities

కేంద్రమంత్రి అమిత్ షా.. హైదరాబాద్‌కి సోమవారం వచ్చారు. తెలంగాణ పర్యటనలో ఆయన ఉండగానే హీరోలు చిరంజీవి, రామ్ చరణ్.. షాతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. అయితే కలవడానికి గల కారణాన్ని చిరు ట్వీట్ చేశారు. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సెలబ్రిటీల సమస్యని ఆయనకు విన్నవించారు.

(ఇదీ చదవండి: బాలకృష్ణతో సినిమా.. రొమాంటిక్ సీన్లపై హీరోయిన్ విమర్శలు)

'ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై నా తీవ్ర ఆందోళనలని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఈ సాంకేతికతల దుర్వినియోగం సెలబ్రిటీల హక్కులు, గౌరవం, సృజనాత్మక కంటెంట్‌కు తీవ్రమైన ముప్పుగా మారుతోందని వివరించాను. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతని కిషన్ రెడ్డికి అప్పగించారు'

'ఈ పరిణామం సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చే ముందడుగుగా భావిస్తున్నాను. మా విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళాకారుల హక్కులు, గౌరవం, సృజనాత్మకతను కాపాడేలా త్వరలోనే సమర్థవంతమైన రక్షణ చర్యలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నాను' అని చిరంజీవి రాసుకొచ్చారు.

రీసెంట్ టైంలో సెలబ్రిటీలు ఏఐతో చేసిన వీడియోల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల క్రితం జాన్వీ కపూర్-ఎన్టీఆర్ 'దేవర' పాటని అసభ్యకర రీతిలో మార్చారు. భవిష్యత్తులోనూ ఇలాంటివి జరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా చిరు..అమిత్ షాని కలిశారు.

(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే జాగ్రత్తపడ్డ 'రామాయణ' మేకర్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement