రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా?: అమిత్‌ షా | amit shah speech in hyderabad | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా?: అమిత్‌ షా

Nov 2 2026 4:51 PM | Updated on Nov 2 2026 6:14 PM

amit shah speech in hyderabad

హైదరాబాద్‌: నగరంలో బీజేపీ సోమవారం మహా పాదయాత్ర నిర్వహించింది. ఇందులో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, కిషన్‌ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి బీజేపీ పాదయాత్ర నిర్వహించింది. అబిడ్స్‌ మీదుగా ఎంజే మార్కెట్‌ వరకు బీజేపీ పాదయాత్ర కొనసాగింది. ఎంజే మార్కెట్‌లో అమిత్‌ షా కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్‌లో చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా అమిత్‌షా దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

పాదయాత్ర ముగిశాక నిర్వహించిన సభలో అమిత్‌ షా జై శ్రీరాం నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కావాలా? వద్దా? అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అరాచకాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. 

‘‘సర్దార్‌ పటేల్‌ లేకుంటే భారత్‌లో హైదరాబాద్‌ విలీనం అయ్యేది కాదు. అరాచక శక్తులను బీజేపీ అంతం చేస్తోంది. చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోంది. 13 కోట్ల ఓట్లను తొలగించారని రాహుల్‌ గాంధీ అంటున్నారు. రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగించాలా... వద్దా? 

ఎస్‌ఐఆర్‌తో అక్రమ వలసదారులను తొలగిస్తున్నాం. కాంగ్రెస్‌ అండ్‌ కో ఎస్‌ఐఆర్‌ ఆపాలని చూస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉంది. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మోదీపై అవినీతి ఆరోపణలు లేవు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. 2014లో మోదీ గెలిచారు అప్పుడు ఎస్‌ఐఆర్‌ ఉందా? 2019లోనూ మోదీ విజయం సాధించారు.. అప్పుడు ఎస్‌ఐఆర్‌ ఉందా? కాంగ్రెస్‌కు మాక్‌ పార్లమెంటే కరెక్ట్‌. అందులోనైనా రాహుల్‌ ప్రధాని రోల్‌ ఎంచుకోవాలి. ఎందుకంటే రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు’’ అని అమిత్‌ షా తెలిపారు. 

హైదరాబాద్ గడ్డ పై అమిత్ షా గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement