హైదరాబాద్ : ఇకపై ప్రతియేటా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ తరపున కె. భాగ్యరెడ్డి బెస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డ్స్ ఇస్తామని సంస్థ ప్రతినిధులు డాక్టర్ కె. భాగ్యరెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డాక్టర్ సతీష్ చంద్రారెడ్డి, డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి తెలిపారు.
బంజారాహిల్స్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నల్లగొండకు చెందిన డాక్టర్ హరినాథ్ కడిమికి తొలిసారిగా డాక్టర్ కె. భాగ్యరెడ్డి బెస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులను ప్రోత్సహించడంతో పాటు వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అవార్డులు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు.


