గోవా నేపథ్యంలో ‘డానీ’... రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Danny Movie Release Date Out | Sakshi
Sakshi News home page

గోవా నేపథ్యంలో ‘డానీ’... రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Nov 3 2026 1:09 PM | Updated on Nov 3 2026 1:14 PM

Danny Movie Release Date Out

ఆశిష్‌ గాంధీ, సేజల్‌ గుప్తా, సోనాల్‌ సింగ్, అజర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డానీ’. కళ్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్, కళ్యాణ్‌ జి. కంటెంట్‌ పిక్చర్స్‌ పతాకాలపై రిజ్వాన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్‌లో ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ–‘‘ఇదొక కల్ట్‌ వైల్డ్‌ డ్రామా. మా సినిమాని ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

(చదవండి: జిమ్ ట్రైనర్‌తో సింగర్ రెండో పెళ్లి.. పోస్ట్ వైరల్)

‘‘ఆశిష్‌ కెమెరా ముందుంటే నాకు కూడా కాన్ఫిడెన్స్‌ వస్తుంది. ఇలాంటి ఓ డిఫరెంట్‌ లవ్‌ అండ్‌ రస్టిక్‌ డ్రామాకు రిజ్వాన్‌ లాంటి నిర్మాత న్యాయం చేస్తారనిపించింది’’ అన్నారు కళ్యాణ్‌ జి. గోగణ. ‘‘నాటకం’ సినిమా తర్వాత ఆశిష్, కళ్యాణ్‌గార్లతో నేను ఈ ‘డానీ’ సినిమా చేశాను. గోవాలోనే ఎక్కువ భాగం చిత్రీకరించాం’’ అన్నారు రిజ్వాన్‌ . ‘‘ప్రేమలోని దశల్ని బట్టి ఇందులో డిఫరెంట్‌ సాంగ్స్‌ రాసే అవకాశం నాకు లభించింది’’ అని పేర్కొన్నారు రాకేందు మౌళి. ఈ కార్యక్రమంలో నటీనటులు సేజల్‌ గు΄్తా, అజర్‌ఖాన్‌, కె మ్యూజిక్‌ ప్రతినిధి ప్రియాంక మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement