ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీ (Orry) బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో తనకున్న స్నేహం, విభేదాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒకప్పుడు సారాతో సన్నిహితంగా ఉన్నానని చెప్పిన ఓరీ.. కష్టకాలంలో ఆమె తనకు అండగా నిలబడలేదని ఆరోపించాడు. అంతేకాదు.. సారా తల్లి, నటి అమృతా సింగ్ తనను దూషించారని, ఇప్పటివరకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని, అందుకే సారా, అమృత ఇద్దరినీ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు వెల్లడించాడు.
నేహా ధూపియా, అంగద్ బేడీ నిర్వహిస్తున్న డబుల్ డేట్ షోలో పాల్గొన్న ఓరీకి.. సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన లేదా అన్‌ఫాలో చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరని ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా సారా అలీఖాన్ పేరు చెబుతూ.. అన్‌ఫాలో చేయడానికి గల కారణాన్ని వివరించాడు.
(చదవండి: 'రామాయణ'కి పైరసీ బెడద.. హైకోర్ట్ కీలక ఆదేశాలు)
సారాతో నాకు చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. కాలేజీ రోజుల్లోనూ ఆ అనుబంధం కొనసాగింది. ఆమె కష్టసమయాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా నిలిచాను. గోవాలో ఓ కేసులో చిక్కుకున్నప్పుడు కూడా నేను ఆమెకు అండగా ఉన్నాను. ఆ సమయంలో చాలామంది సన్నిహితులు ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా నేను సారాకు, ఆమె కుటుంబానికి అండగా నిలిచాను. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు సారా కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎలా ఉన్నావని అడగలేదు. ఆ సమయంలో ఆమె ప్రవర్తన నన్ను చాలా బాధించింది.
అందేకాదు ఓ సారి సారా తల్లి అమృత నన్ను తీవ్రంగా కొట్టింది. ఇతరులు దగ్గర నా గురించి బ్యాడ్‌గా చెప్పింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆమె నాకు క్షమాపణలు చెప్పలేదు. అలాంటి వారితో స్నేహంగా ఉండడం ఇష్టంలేక నేను దూరమయ్యాను. అందుకే ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాను’ అని ఓరీ చెప్పుకొచ్చాడు.


