Gulshan Devaiah Opens Up About Vijay Varma And Tamannaah Bhatia's Relationship; Deets Inside - Sakshi
Sakshi News home page

మాజీ భార్యతో నటుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. విజయ్‌- తమన్నాల రిలేషన్‌పై ఓపెన్‌ కామెంట్స్‌

May 29 2023 10:59 AM | Updated on May 29 2023 11:41 AM

Gulshan Devaiah Feels Tamannaah Slap Him For Linking Her and Vijay Varma - Sakshi

కొందరైతే బంగారు, వజ్రాభరణాలు సైతం పంపిస్తుంటారు. ఈసారి మాత్రం నా మాజీ భార్య కలిరోయ్‌ జియాఫెటా నా పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసింది. అందుకు చాలా సంతోషం

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందా? ఈ ప్రశ్నకు ఆవిడే సమాధానం చెప్పాలి. కానీ అంతవరకు ఆగలేని జనాలు సోషల్‌ మీడియాలో తమన్నా, విజయ్‌ వర్మతో క్లోజ్‌గా కనిపించడంతో ఆవిడ లవ్‌లో మునిగి తేలుతోందని ఫిక్సయ్యారు. ఇంతలో విజయ్‌ వర్మ స్నేహితుడు గుల్షన్‌ దేవయ్య.. నా తమన్నాతో తిరుగుతున్నావంటూ విజయ్‌ను ఆటపట్టించడంతో ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.‌ తాజాగా తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చాడు గుల్షన్‌.

బర్త్‌డేకు గోల్డ్‌ గిఫ్ట్‌..
'ద గర్ల్‌ ఇన్‌ ఎల్లో బూట్స్‌'తో సినీ కెరీర్‌ను ప్రారంభించిన గుల్షన్‌ దేవయ్య ఆదివారం(మే 28) 45వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన గురించి విజయ్‌-తమన్నాల రహస్య రిలేషన్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'బర్త్‌డే అంటే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఏమీ ఉండదు. హాయిగా రోజంతా నిద్రపోతే బాగుండనిపిస్తుంది. కానీ బోలెడన్ని మెసేజ్‌లు వస్తుండటంతో వాటన్నింటికీ రిప్లై ఇవ్వాల్సి వస్తోంది. కొందరైతే బంగారు, వజ్రాభరణాలు సైతం పంపిస్తుంటారు. ఈసారి మాత్రం నా మాజీ భార్య కలిరోయ్‌ జియాఫెటా నా పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసింది. అందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆమె నన్ను కొడుతుందేమో!
విజయ్‌ వర్మ, తమన్నా రిలేషన్‌పిల్‌లో ఉన్నారా? లేదా? అనేది నాకు తెలియదు. వారిద్దరూ కలిసున్న రెండు,మూడు ఫోటోలు చూశాను. ఆమెను నేనెప్పుడూ కలవలేదు, కనీసం తనెవరో కూడా తెలియదు. నేను వాగింది చూసి ఆమె నన్ను కొట్టినా కొడుతుందేమో! నా గురించి నోటికొచ్చింది వాగుతున్నావేంటి? అని నా చెంప చెళ్లుమనిపిస్తుందేమో(నవ్వుతూ)! ఇప్పటికే ఆమె ఫ్యాన్స్‌ నన్ను ట్రోల్‌ చేశారనుకోండి.

ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని తమన్నా అభిమానులు తిట్టారు. సీరియస్‌గా చెప్పాలంటే వారి మధ్య ఏం జరుగుతుందో నాకు ఏం తెలియదు. అది వారి పర్సనల్‌ లైఫ్‌. విజయ్‌ను ఏడిపించడానికి ఆ సందర్భాన్ని వాడుకున్నానంతే! ఇకపోతే సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న సాయిపల్లవి నా క్రష్‌' అని చెప్పుకొచ్చాడు గుల్షన్‌.

చదవండి: పవన్‌ కల్యాణ్‌ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement