
దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉంటోంది.
అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్‌నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)
'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్‌లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.
2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్‌ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు)