
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్‌గా చేసిన 'డెవిల్' ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.
(ఇదీ చదవండి: 'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం)
సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ 'అఖండ 2', పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ', నిఖిల్ 'స్వయంభు', లారెన్స్ 'బెంజ్', మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో 'అఖండ 2'.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.
సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్‌గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్‍గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)