
రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్‌తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్‌ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.
(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)
అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్‌తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్‌ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్‌పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.
ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.
(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ)