
తమన్నా భాటియా (Tamannaah Bhatia)- విజయ్ వర్మ (Vijay Varma).. ప్రేమకబుర్లు చెప్పుకున్నారు. పెళ్లి కోసం కలలు కన్నారు. వాటిని కలగానే మిగుల్చుతూ విడిపోయారు. పెళ్లి ముఖ్యమా? కెరీర్ ముఖ్యమా? అంటే కెరీరే కావాలని విజయ్ అన్నాడని.. అందుకనే విడిపోయారన్న ప్రచారమూ జరిగింది. ముచ్చటైన జంట అనుకునేలోపే ప్రేమ బంధాన్ని ముక్కలు చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
చాలా త్వరగా క్లోజ్ అయిపోయాం!
ఇటీవల ముంబైలో జరిగిన హోలీ ఈవెంట్‌కు వీరిద్దరూ విడివిడిగా హాజరయ్యారు. రవీనా టండన్ కూతురు రాషా (Rasha Thadani)తో కలిసి హోలీ ఆడారు. తమన్నా, విజయ్ అంటే రాషాకు బోలెడంత ఇష్టం. దాని గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లాను. అక్కడ తమన్నా కూడా ఉంది. ఓ సింగర్ పాడుతూ ఉంటే స్టేజీ ముందు డ్యాన్స్ చేస్తున్నాను. తమన్నా కూడా అక్కడే స్టెప్పులేస్తోంది. ఒకరినొకరం చూసుకున్నాం. కలిసి డ్యాన్స్ చేశాం. అలా పరిచయం ఏర్పడింది. చాలా త్వరగా క్లోజ్ అయిపోయాం.
వీళ్లిద్దరూ నా గాడ్‌పేరెంట్స్
తను లేకపోతే ఏం చేయాలో కూడా తోచదు. తమన్నా, విజయ్ వర్మ.. వీరిద్దరూ నాకు అంత బాగా క్లోజ్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన పేరెంట్స్ అయ్యారు అని చెప్పుకొచ్చింది. రాషా.. ఇటీవలే 20వ పడిలోకి అడుగుపెట్టింది. తన బర్త్‌డే పార్టీకి తమన్నా కూడా హాజరైంది. ఇదిలా ఉంటే రాషా ఈ ఏడాదే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలి చిత్రం ఆజాద్. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
చదవండి: బాలీవుడ్‌లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య