
సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ తమన్నా. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో అలరించిన భామ.. ప్రస్తుతం డూ యూ వన్నా పార్ట్నర్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే గతంలో బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మ ప్రేమాయణం నడిపింది. అతనితో కొన్నినెలల పాటు డేటింగ్ చేసిన తమన్నా.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరు తమ సీనీ లైఫ్లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల తమ మాజీ బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ మరో నటితో షికార్లు చేస్తూ సోషల్ మీడియాలో కనిపించారు. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.
తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీని ప్రశ్నించగా తమన్నా రియాక్ట్ అయింది. విజయ్ వర్మతో తనకు బ్రేకప్ అయ్యి చాలా రోజులైందని తెలిపింది. అలాంటప్పుడు అతను ఎవరితో తిరిగితే నాకేంటిని కామెంట్స్ చేసింది. అతను ఎవరిని ప్రేమిస్తే తనకు ఏంటి అంటూ మాట్లాడింది. విజయ్ వర్మను ఉద్దేశించి తమన్నా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.